తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఇందులో హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో ప్రేక్షకులను షాక్ ఇవ్వనున్నాడని టాక్. అయితే ఈ సినిమాపై మూవీ మేకర్స్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఆగస్ట్ 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.