పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులతో శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి ఉద్యాన కళాశాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేయాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో డిసిసిబి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, కళాశాల అసోసియేట్ డీన్ సైదయ్య పాల్గొన్నారు.