ఆహార భద్రత కమిటీ తనిఖీలు చేయాలి: వనపర్తి కలెక్టర్

59பார்த்தது
ఆహార భద్రత కమిటీ తనిఖీలు చేయాలి: వనపర్తి కలెక్టర్
వనపర్తి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలతో సహా బయట హోటల్స్ లోనూ ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయంలో జిల్లా ఆహార భద్రత కమిటీ సభ్యులు ముమ్మర తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி