రేవల్లి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

80பார்த்தது
రేవల్లి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గురువారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ లో శిథిలావస్థకు చేరిన గదులను పరిశీలించి వాటి పటిష్టతకు కావలసిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆసుపత్రిలోని వైద్యుల వివరాలను, రోగులకు అందించే చికిత్స వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி