శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి: ఎస్పీ

76பார்த்தது
శేష జీవితాన్ని ఆనందంగా గడపాలి: ఎస్పీ
వనపర్తి జిల్లా పానగల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన పోలీస్ కానిస్టేబుల్ దొడ్ల పద్మనాభ రెడ్డి (పీసీ1295) పదవీ విరమణ తర్వాత శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఎస్పీ రక్షిత కె. మూర్తి అన్నారు. మంగళవారం పదవి విరమణ పొందుతున్న సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సతీమణితో కలిసి ఆయనకు శాలువా కప్పి మెమెంటో అందించి సన్మానించారు. కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி