నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, త్రాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.