గుజరాత్ లో జరుగుతున్న భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ సమావేశంలో ఆదివారం నారాయణపేట జిల్లా నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి అనంత్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యలు, మద్దతు ధరల కొరకు రైతుల పక్షాన పోరాటం చేయాలని జాతీయ నేతలు చెప్పారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబా, తదితరులు పాల్గొన్నారు.