రానున్న మహా శివరాత్రి పురస్కరించుకొని నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వెలసిన ఔదుంబర్ మల్లికార్జున స్వామి ఆలయ కోనేరును శనివారం గ్రామ ఆర్ఎస్ఎస్ సేవకులు శుభ్రం చేశారు. కోనేరులో పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని బయటికి తీసి శుభ్రం చేశారు. లోకాయపల్లి సంస్థానాన్ని పాలించిన రాజులు కోనేరు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.