నారాయణపేట సరాఫ్ బజార్ లోని అశోక్ పసారి అనే వ్యక్తికి చెందిన కిరాణం దుకాణంలో శుక్రవారం నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులు కిరాణం దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డట్లు చెప్పారు. రూ. 38, 985 విలువ గల గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేశామని చెప్పారు. గుట్కా ప్యాకెట్లు అమ్మిన, నిల్వ చేసిన చర్యలు తీసుకుంటామన్నారు.