దసరా పండుగను మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన సొంత గ్రామం కోయిలకొండ మండలం శేరి వెంకటాపూర్ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రజలతో కలిసి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం షమీ అందించి విజయదశమి పండుగ శుభకాంక్షలు తెలిపారు. అందరిలో చెడు తొలగి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని అన్నారు. పాలపిట్ట, జమ్మి చెట్టును రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు.