దామరగిద్ధ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని చెరువులో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్ చేప పిల్లలను విడుదల చేశారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తామని చెప్పారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు.