వంగూరు మండలంలోని రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని విక్రయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతులను కోరారు. గురువారం వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్రలో ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని వంశీకృష్ణ అన్నారు. రైతులు, నాయకులు పాల్గొన్నారు