నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 14 ఫిర్యాదులు నమోదైనట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. భూమి పంచాయతీలు 10, భార్యాభర్తల మధ్య పంచాయతీ 1, ఇతర రకాల ఫిర్యాదులు 03 నమోదైనట్లు సూచించారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.