జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల ఉట్కూర్ మండలం పెద్దజట్రం మాజీ ఎంపీటీసీ సభ్యులు కిరణ్ కుమార్ ఎంపి డికే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపి ని శాలువాతో సన్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తానని, అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేస్తానని కిరణ్ కుమార్ అన్నారు. గ్రామస్తులు ఆయనను అభినందించారు.