మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం అక్టోబర్ 8 నుంచి 30వ తేదీ వరకు సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పి. నర్సింహులు తెలిపారు. అర్హులైన వారు స్లాట్ బుకింగ్ లో సూచించిన తేదీలలో స్లాట్ రశీదు, మెడికల్ రిపోర్టు, ఆధార్ కార్డులతో శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.