పాలమూరు యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగులు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సమస్యలపైన ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.