ధన్వాడ మండల కేంద్రంలో సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేకు కట్ చేశారు. మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ ప్రకాష్, బాలరాజు, శ్రీనివాస్ నాయుడు, మోగులప్ప, అభిలాష్, జలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.