కల్వకుర్తి పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పోషణ మాసం వేడుకలను కిశోర బాలికలను ఉద్దేశించి సిడిపిఓ భాగ్యమ్మ సోమవారం తగిన సూచనలు సలహాలు అందజేసి రక్తహీనత పై అవగాహన కల్పించారు. పిల్లలకు రక్తహీనత రాకుండా అందుబాటులో ఉండే చిరుధాన్యాలు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు అన్నీ కలిపి సమతుల ఆహారంగా అందించాలన్నారు. పిల్లలతో పోషణ మాసం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.