రానున్న రోజుల్లో డిజిటల్ రంగమే అని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 15, చిన్నదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే డిజిటల్ మెటీరియల్ ను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో పాలమూరును విద్యాహబ్ గా మార్చడమే ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు.