హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ హాకీ టోర్నమెంట్ లో రెండో రోజు శనివారం మహబూబ్ నగర్ జిల్లా హాకీ జట్టు సెమీఫైనల్ కు చేరింది. రెండవ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్లతో క్రీడాకారులు అత్యున్నత మైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ఆదివారం నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల జట్లు సెమీఫైనల్ లో పోటీ పడతాయని నిర్వాహకులు తెలిపారు.