కొడంగల్: భూములు ఇచ్చేది లేదు.. ఫార్మా వద్దే వద్దు

61பார்த்தது
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో శుక్రవారం జరగాల్సిన ఫార్మా విలేజ్ కు సంబంధించి భూసేకరణ కార్యక్రమ సభ వాయిదా పడింది. రోటిబండ తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రైతుల వద్దకు చేరుకున్న జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఎస్పీ నారాయణ రెడ్డి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఫార్మా విలేజ్ కు తమ భూములు ఇవ్వరని, ఫార్మా కంపెనీ ఏర్పాటు వద్దే వద్దని తెలిపారు.

தொடர்புடைய செய்தி