జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయం, స్థానిక బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటింటి కుటుంబ సర్వేపై ఎన్యుమరేటర్లకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బోయి విజయేందిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో ఇంటింటికి వెళ్లి ఇండ్ల జాబితా తయారు చేయాలన్నారు.