జడ్చర్ల: పెట్రోల్ పోసుకొని ఇంటర్ విద్యార్థి సూసైడ్

63பார்த்தது
జడ్చర్ల: పెట్రోల్ పోసుకొని ఇంటర్ విద్యార్థి సూసైడ్
పెట్రోల్ పోసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శివ నాగేశ్వర్ నాయుడు వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక(17) జడ్చర్లలో ఇంటర్ చదువుతోంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி