జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో గిరిజన యోధుడు కొమురం భీం జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీం పోరాటాలు జల్, జంగిల్, జమీన్ అడవి, భూమి కోసం సాగాయి. ఆయన ధైర్యసాహసాలు నిజాం నవాబులను కలవరపెట్టాయి. ఈ జయంతి సందర్భంగా ఆయన పోరాటాలను స్మరించుకుంటూ గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని జరిపారు.