ఇటిక్యాల మండలం ఉదందాపురంలోనీ బీసీ కాలనీలో గత కొద్ది రోజుల నుండి కరెంటు స్తంభం తీగలు పూర్తిస్థాయిలో కిందకు జారిపోయాయి. మనిషి ఎత్తులోనే విద్యుత్ తీగలు ఉన్నందున వాహనదారులు గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టాలని కోరారు.