జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఆంజనేయస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని మొదలుపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.