మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి అలంకరణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన తొలి పూజ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, సంస్థానాధీశులు శ్రీరామ్ భూపాల్, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని స్వామివారిని వేడుకున్నట్టు పేర్కొన్నారు.