సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని ప్రముఖ మానసిక నిపుణులు గేమియా నాయక్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆత్మహత్యల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలని, సమస్య వచ్చినా వెంటనే సంబంధిత లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.