దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం అప్పంపల్లి పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ సారి క్వింటాలు సన్న వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.