మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాదయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో పాడిపంటలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని, సాయిబాబా ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు.