ఏపీలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై 10 శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. దీన్ని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా పేర్కొన్నారు.