యూపీలోని కుశినగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రే తన కుమార్తెను హత్య చేశాడు. నెబువా నౌరంగియా గ్రామంలో ఉండే జైనారాయణ్ సింగ్కు నౌకా తోలా గ్రామంలో మరో ఇల్లు ఉంది. అక్కడ పొరుగింటి వారితో భూ వివాదం ఉంది. నవంబరు 1న తన చిన్న కుమార్తెను అతడు మర్డర్ చేసి.. నేరాన్ని పొరుగింటి వారిపై మోపేందుకు మృతదేహాన్ని నౌకా తోలాలోని ఇంట్లో వేశాడు. దుండగులు తన కూతురిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో జైనారాయణ్ బాగోతం బయటపడింది.