సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని టియుసిఐ జిల్లా కార్యదర్శులు పాయం వెంకన్న, షేక్ యాకుబ్ షావలి అన్నారు. ఆదివారం టేకులపల్లి సింగరేణి కెఓసి ప్రాజెక్ట్ పిఓ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం నిర్వహించారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 2017లో పెంచారని, అప్పటి నుంచి గత ఏడు సంవత్సరాల కాలంలో యాజమాన్యం కార్మికుల జీతాలు పెంచలేదని పేర్కొన్నారు.