టేకులపల్లి మండలంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేయాలని, క్వింటాలుకు 8వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అందుగులగూడెం గ్రామంలో సిపిఎం మండల కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ మండలంలో పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.