ఇల్లెందు మండలానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థి శనివారం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా ఉదయం ఇంట్లో ఓ లేఖ ఉంచి వెళ్లిపోయాడు. లేఖలో తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని అందుకే ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని రాసి ఉండగా అతని కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు ఏఎస్సై నాగేశ్వరరావు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.