ఇల్లెందు పట్టణంలోని సబ్ జైలు బస్తీకి చెందిన యువతి మహ్మద్ తీర్ధాస్ కు షేక్ షకీల్ ఖురేషీతో ఆర్నెల్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి తనను భర్త, అత్త హనీషా, మామ జిలానీ, మరిది శంషీర్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు స్థానిక పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఎస్సై సూర్యం కేసు నమోదు చేశారు.