ఇల్లందు పట్టణంలో అతి కిరాతకంగా జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. బాధిత విలేకరి సుదర్శన్ ఫిర్యాదు మేరకు వంశీ, ప్రేమ్, ఉదయ్, యాకూబ్ తో పాటు వారికి సహకరించిన అనిల్, ప్రసాద్, నాగేశ్వరరావులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.