వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీరు ద్వారా అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడైనా నీటి కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామన్నారు. నిరంతరం తాగునీరు అందిస్తామని చెప్పారు.