నష్టపోయిన పంట పొలాలు పరిశీలన

85பார்த்தது
నష్టపోయిన పంట పొలాలు పరిశీలన
బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలులో అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం అధికారులు పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా రైతులు జరిగిన నష్టాన్ని అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వరంగల్ డాక్టర్ ఉమారెడ్డి, జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నారాయణమ్మ, మణుగూరు ఏడీఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி