నేటి సమాజంలో మహిళలు స్వయంశక్తితో ఉన్నత స్థాయికి ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మణుగూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా స్త్రీశక్తి క్యాంటీన్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవాలన్నారు. వంట నిర్వహణలో శిక్షణ పొందిన మహిళలకు ద్రువపత్రాలు అందజేశారు.