భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమరం వెంకటేశ్వర్లు తల్లి కొమరం లక్ష్మి అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నేత ధనసరి సూర్య కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచి దశదిన కార్యానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్పల రాములు నాయక్, వేముల శ్రీనివాస్, దగభట్ల కృష్ణ, యువజన నాయకులు మాటూరి ప్రవీణ్, పామర్తి అశోక్ సూర్యన్న ప్రచారకర్త చంద వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.