విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సూచించారు. కృష్ణసాగర్ గురుకుల కళాశాలను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.