అశ్వాపురం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, కొత్త చట్టాలపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ అశోక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అలాగే అపరిచిత వ్యక్తులు పంపే లింకులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సీఐ సూచించారు.