ఆళ్ళపల్లి మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన రైతులకు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రాజెక్ట్ కింద పండ్లతోటల పెంపకానికి జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంక్ కొంత రాయితీలతో సహకరిస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా నాబార్డ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ యల్. సుజిత్ అన్నారు. బుధవారం ఆయన అనంతోగు గ్రామంలో పలు గ్రామాల గిరిజన రైతులకు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రాజెక్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.