పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ పర్యాటనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కిన్నెరసాని ప్రాజెక్ట్ పార్క్ అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పార్క్ నందు చేయవలసిన అభివృద్ధి పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.