ఈనెల 31న జరిగే ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం మణుగూరు సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్మిక వాడలో ఏఐటీయూసీ జెండాలను ఎగురవేయాలని కోరారు. దేశంలో స్వాతంత్రం రాకముందే ఏఐటీయూసీగా ఆవిర్భవించిందని చెప్పారు. కార్మిక, కర్షక వర్గాల కోసం అనేక హక్కులు సాధించిందన్నారు.