కొత్తగూడెం: రామవరం గోధుమ వాగులో ఐదు కిలోల వాలుగా సునీల్, చిన్ను అనే యువకులు పట్టారు. వీరు తరచుగా చేపల షికారుకు వెళుతూ ఉంటారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు షికారుకు వెళ్లగా 5 కిలోల వాలుగా వలకు పడిందన్నారు. దీపావళి రోజు ఈ చేప పడటం దీపావళి కానుకగా అనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మేము చేపల వేటకు వెళ్తున్న ఇంత పెద్ద చేప పడటం ఇది మొదటిసారన్నారు.