కరకగూడెం ఎన్కౌంటర్ విషయంలో నిజనిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకులను మణుగూరు పోలీసులు నిర్బంధించడం సరికాదని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న శనివారం అన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ ఘటనను ఖండించాలని ఐఎస్టియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. కరకగూడెం ఎన్కౌంటర్ పక్కా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు.