భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం ముక్కోటి వచ్చేనాటికి పనులను పూర్తి చేయాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ సంబంధిత మ్యూజియం కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశానుసారం కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.