భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి చేయాల్సిన పనులను ఆదివారం అధికారులు ఖరారు చేశారు. 2025 జనవరి 9న తెప్పోత్సవం, అదే నెల 10న ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది. ఇందుకు 15 రకాల పనులకు సుమారు రూ. 84. 21 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ అనం తరం ఖర్చుల అంశంలో స్పష్టత రానుంది. ఇందులో రంగులు, క్యూలైన్లు, విద్యుద్దీపాల అలంకరణ, చలువ పందిరి నిర్మాణాలు, తాత్కాలిక వసతి సదుపాయం ఏర్పాటు చేయనున్నారు.